Breaking News

భీకర కాల్పులు.. రక్తపు టేరులుగా గంగలూరు ఆండ్రీ అడవులు

Published on Thu, 03/20/2025 - 13:39

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం భద్రతా బలగాలు-మావోయిస్టులు మధ్య భీకర కాల్పులతో గురువారం మారుమోగింది. ఉదయం నుంచి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో 30 మంది నక్సలైట్లు మరణించగా.. ఓ డీఆర్‌జీ(District Reserve Guard) జవాన్‌ సైతం వీరమరణం చెందారు. ప్రస్తుతం రెండు చోట్లా.. పోలీస్‌ కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో నక్సలైట్లు దాగినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. గురువారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ఇక.. కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఈ మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులు, దాడుల్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)