Breaking News

జయప్రదకు బిగ్‌ షాక్‌.. జైలు శిక్ష విధించిన కోర్టు..

Published on Fri, 08/11/2023 - 13:42

సాక్షి, చెన్నై: సీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 

ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)