Breaking News

చార్‌ధామ్‌ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు

Published on Sat, 08/24/2024 - 12:57

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం కురిసిన వర్షం కారణంగా వివిధ చోట్ల కొండచరియలు విరిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది.  ఎన్‌హెచ్‌, బీఆర్‌ఓ బృందాలు ప్రస్తుతం రోడ్డును క్లియర్‌ చేసే పనులు చేపడుతున్నాయి.

చమోలి- నందప్రయాగ్ మధ్య మూడు ప్రదేశాలలో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. చోప్టా మోటర్‌వేపై గోడ కూలిపోవడంతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నందప్రయాగ్ సమీపంలో రహదారి కూడా మూసుకపోవడంతో 700 మంది బద్రీనాథ్ యాత్రికులు చమోలి, పిపల్‌కోటి, నందప్రయాగ్, కర్ణప్రయాగ్, గౌచర్ మరియు ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరికి అధికారులు బిస్కెట్లు, తాగునీరు అందించారు.

నంద్‌ప్రయాగ్‌లో హైవే మూసుకుపోయిన కారణంగా, కౌటియల్‌సైన్ నందప్రయాగ్ మోటార్ రోడ్డు గుండా  వాహనాలు వెళ్లాయి. సోన్లా సమీపంలో భారీగా  బండరాళ్లు పడటంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా రిషికేశ్-బద్రీనాథ్ హైవేలో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్‌ బృందం జేసీబీతో మట్టిని తొలగించే పనులు చేపడుతోంది. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)