Breaking News

చంద్రికకు గ్రామీ 

Published on Tue, 02/04/2025 - 04:25

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమెరికన్‌ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్‌ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్‌ న్యూ ఏజ్‌ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బం ‘త్రివేణి’తో ఆమెకీ గుర్తింపు దక్కింది. లాస్‌ ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్‌ కామ్‌ అరెనాలో ఆదివారం గ్రామీ 67వ ఎడిషన్‌ ఉత్సవం జరిగింది. ‘ఈ గుర్తింపుతో సంగీతమంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. సంగీతం మనందరి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తుంది.

 విషాద వేళల్లోనూ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది’అని ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. చంద్రికా టాండన్‌ ప్రముఖ బిజినెస్‌ లీడర్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయీకి స్వయానా తోబుట్టువు కావడం విశేషం. చెన్నైలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్‌ 2009లో ‘సౌల్‌ కాల్‌’అనే ఆల్బమ్‌కుగాను మొట్టమొదటి గ్రామీ గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్‌మన్, మట్సుమొటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్‌ 2024 ఆగస్ట్‌లో విడుదలైంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)