Breaking News

చంద్రయాన్ 3:కీలక ఘట్టానికి రంగం సిద్ధం

Published on Fri, 09/22/2023 - 11:06

చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో సమాయత్తమవుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను మేల్కొల్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. సూర్యరశ్మి తాకగానే రోవర్ నుంచి సిగ్నల్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. రోవర్, ల్యాండర్ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. 

నిద్రాణ స్థితి..
చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల వ్యవధిలో  నిర్దేశించిన లక్ష‍్యాలను చేరుకున్నాయి. కీలక సమాచారాన్ని చేరవేశాయి. చంద్రునిపై 14 రోజులు పాటు పగలు, 14 రోజులు రాత్రి ఉంటోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న రోవర్‌ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితిలోకి పంపారు. 

మేల్కొల్పు..
విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ ‍అయిన శివశక్తి పాయింట్‌.. దక్షిణ ధ్రువానికి 600 మీటర్ల దూరంలో ఉంది. 14 రోజుల తర్వాత చంద్రునిపై నేడు సూర్యోదనయం కానుంది. సూర్యరశ్మి రోవర్‌పై పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్‌ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.     

ఇదీ చదవండి: ఇస్రో సేవలు అద్భుతం

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)