Breaking News

Chandrayaan-3 Updates: మరింత దగ్గరగా చంద్రయాన్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌

Published on Mon, 08/21/2023 - 05:34

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్‌–3 మిషన్‌లో రెండో భాగమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ కక్ష్య దూరాన్ని మరోసారి తగ్గించారు. అందులోని ఇంధనాన్ని ఆదివారం వేకువజామున 2 గంటలకు స్వల్పంగా మండించి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడికి 25x134 కిలోమీటర్లు ఎత్తుకు అంటే చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. మొదటి విడతలో 113 కిలోమీటర్ల దూరాన్ని 25 కిలోమీటర్లకు, 157 కిలోమీటర్ల దూరాన్ని 134 కిలోమీటర్ల తగ్గించి చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడికి మరింత చేరువగా తీసుకొచ్చారు.

ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బెంగళూరులోని మిషన్‌ ఆపరేటర్‌ కాంఫ్లెక్స్‌ (ఎంవోఎక్స్‌), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌), బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (ఐడీఎస్‌ఎన్‌) కేంద్రాల్లో శాస్త్రవేత్తలు 23న సాయంత్రం 5.37 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌లో ఉన్న ఇంధనాన్ని స్వల్పంగా మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 37 నిమిషాల పాటు జరగనున్న ఈ ఆపరేషన్‌ అత్యంత కీలకం కానుంది.   

చంద్రుడిపై దిగడం విజయవంతమైతే
చంద్రయాన్‌–3 మిషన్‌ ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం దగ్గర పడడంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఉంది. రష్యా ప్రయోగించిన లూనా–25 మిషన్‌ చంద్రయాన్‌–2 తరహాలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని ఆఖరి దశలో విఫలైమంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో కూడా ఒకింత ఆందోళన మొదలైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తి చూస్తున్న ఈవెంట్‌ను 23న సాయంత్రం 5.27 గంటలకు ప్రత్యక్షప్రసారాన్ని కల్పిస్తున్నారు. చంద్రయాన్‌–3లో ల్యాండర్‌ చంద్రుడిపై దిగే అంశంలో ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, పేస్‌బుక్, డీడీ నేషనల్‌ టీవీ చానెల్‌తో సహా బహుళఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉంచారు.

Videos

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)