Breaking News

‘పీఎం–ఈ–డ్రైవ్‌’ పథకంతో ఈవీ రంగానికి ప్రోత్సాహం

Published on Sun, 02/16/2025 - 05:15

సాక్షి, న్యూఢిల్లీ: ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవని, ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల పార్లమెంట్‌లో తెలిపింది. ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధాన మంత్రి–ఈ–డ్రైవ్‌’ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చిoదని తెలిపింది. 

ఈ పథకం ద్వారా ఈ–కార్లకు జీఎస్‌టీ, పన్ను, పర్మిట్‌లో మినహాయింపు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు చెప్పింది. 2030 నాటికి ప్రైవేటు ఎలక్ట్రిక్‌ కార్లలో 30శాతం, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలలో 80శాతం వృద్ధిని సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఛార్జింగ్‌ పాయింట్‌లను, ఛార్జింగ్‌ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో 1,266, తెలంగాణలో 1,289.. 
‘ఫాస్టెర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌’(ఎఫ్‌ఏఎంఈ) సబ్సిడీ పథకం కింద దేశవ్యాప్తంగా 4,523 ఛార్జర్‌లు ఉండగా, 251 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ‘ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీస్‌’(ఓఎంసీఎస్‌) పథకం కింద దేశవ్యాప్తంగా 20,035 ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌ఏఎంఈ పథకం కింద 354 ఛార్జర్‌లు ఇన్‌స్టాల్‌ జరగగా, 20 ఛార్జింగ్‌ స్టేషన్‌లు, ఓఎంసీఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 912 ఛార్జింగ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎఫ్‌ఏఎంఈ కింద 238 ఛార్జర్‌లు ఇన్‌స్టాల్‌ చేయగా, ఒకే ఒక్క ఛార్జింగ్‌ స్టేషన్‌ ఉండగా, ఓఎంసీఎస్‌ కింద 1,051 స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.  

దేశవ్యాప్తంగా 16.14లక్షల ఈవీలు.. 
దేశవ్యాప్తంగా ఎఫ్‌ఏఎంఈ పథకం సెకెండ్‌ ఫేజ్‌లో 16,14,737 లక్షల ఈవీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో టూవీలర్‌లు 14, 28,009లక్షలు, త్రీవీలర్‌లు 1,64,180, ఫోర్‌ వీలర్‌లు 22,548 ఉన్నట్లు తెలిపింది. ఈసంఖ్యను రానున్న రోజుల్లో పెంచేదిశగా తాము ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వివరించింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)