Breaking News

రాష్ట్రపతి భవన్‌: మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు.. ఇకపై అమృత్ ఉద్యాన్‌

Published on Sat, 01/28/2023 - 17:02

Amrit Udyan.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని  రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొఘల్‌ గార్డెన్‌ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చింది. మరోవైపు.. జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.  

అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్‌కు అనుగుణంగా మొఘల్‌ గార్డెన్స్‌ పేరును మార్చుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇక, ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం, 31వ తేదీ నుంచి అమృత్‌ ఉద్యాన్‌లోకి ప్రజలకు ఎంట్రీ లభించనుంది. ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు అమృత్‌ ఉద్యాన్‌లోకి ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.

రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో మొఘల్‌ గార్డెన్‌ ఉంది. దీన్ని మొఘల్ గార్డెన్స్‌ను మొఘల్‌ చక్రవర్తులు నిర్మించారు. ఇవి పెర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. సాధారణంగా ఈ గార్డెన్స్ లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని  షాలిమర్  గార్డెన్స్ మొఘల్‌ గార్డెన్స్‌లో ఉన్నాయి. తాజ్ మహల్ వద్ద కూడా మొఘల్  గార్డెన్స్‌ ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)