Breaking News

ఈవీఎం బ్యాలెట్‌పై కలర్‌ ఫొటోలు

Published on Wed, 09/17/2025 - 16:42

పట్నా: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం) బ్యాలెట్‌ పేపర్‌ లేఔట్‌లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది. 

గతంలో ఈవీఎం లేఔట్‌పై అభ్యర్థుల ఫొటోలు నలుపు,తెలుపు రంగులో ఉండేవి. కొందరి ఫొటోలైతే అస్సలు ముద్రించకపోయేవాళ్లు. ఇకపై కలర్‌ ఫొటోలను ముద్రించి ఓటర్లు సులభంగా తమ అభ్యర్థులను గుర్తించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో ముప్పావువంతు సైజులో ఫొటో పెద్దగా కని్పంచనుంది. దీంతో కంటి సమస్యలున్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటేసే అవకాశమొచ్చింది. 
 
కొత్తగా వచ్చిన   మార్పులేంటి? 
→ అభ్యర్థి సీరియల్‌ నంబర్‌తోపాటు ‘ఎవరికి ఓటు వేయబోము(నన్‌ ఆఫ్‌ ది ఎబో–నోటా) అనే ఆప్షన్‌ సైతం పెద్ద సైజులో ఉండనుంది.  

→ అంతర్జాతీయ భారతీయ అంకెల విధానమైన లక్షలు, కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నంబర్‌ ఫాంట్‌సైజులో ముద్రిస్తారు.  

→ స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్‌లో ప్రింట్‌చేస్తారు.  

→ అభ్యర్థుల అందరి పేర్లు ఒకే పరిమాణంలో కన్పించేలా ఒకే నంబర్‌ ఫాంట్‌ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి(ఫాంట్‌) రకాలు వేర్వేరుకాకుండా ఒకే రకం ఫాంట్‌ను వాడనున్నారు 

→ చదరపు మీటర్‌కు 70 గ్రాముల బరువు ఉండే 70 జీఎస్‌ఎం గ్రేడ్‌ పేపర్‌ను ఈవీఎం బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీరంగు పేపర్‌ను ఉపయోగిస్తారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్‌లను ప్రత్యేకంగా వాడనున్నారు. 

→ బిహార్‌లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)