Breaking News

బాల్య వివాహాల కట్టడిపై కేంద్రం దృష్టి

Published on Fri, 04/11/2025 - 05:27

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సంబంధిత చట్టాన్ని  పకడ్బందీగా అమలు చేస్తోంది. అందులో భాగంగా  2024 నవంబర్‌ 27న ‘బాల్‌ వివాహ ముక్త్‌ భారత్‌’ ప్రచారాన్ని ప్రారంభించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగా­హన పెంపొందించడం, ఈ ఘటనలు ఎక్కడ జరిగినా నిరోధించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. 

బాల్య వివాహాల నిషేధ పర్యవేక్షణ అధికారులను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. మరోవైపు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహా­రాల మంత్రిత్వ శాఖలో  ‘మిషన్‌ శక్తి’ పథకం కింద బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ కూడా బాల్య వివాహాలను అరికట్టే విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 1098 అనే నెంబర్‌తో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. 

మరోవైపు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడేళ్లలో దేశంలో 2,837 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 2021లో 1,050 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల పరంగా చూస్తే ఈ మూడేళ్లలో అత్యధికంగా కర్ణాటకలో 672 , తమిళనాడులో 401, పశ్చిమబెంగాల్‌లో 324 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 170, ఆంధ్రప్రదేశ్‌లో 77 బాల్య వివాహాలు జరిగాయి. 
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)