Breaking News

ఆప్‌కు అక్రమంగా విదేశీ నిధులు

Published on Fri, 04/18/2025 - 06:18

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టి(ఆప్‌)కి విదేశాల నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ గుజరాత్‌ ఎన్నికల సహ ఇన్‌చార్జి దుర్గేశ్‌ పాఠక్‌ ఇంటిపై గురువారం సీబీఐ అధికారులు దాడులు జరిపారు. విదేశీ విరాళాల నిబంధనల సవరణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ)– 2010కు విరుద్ధంగా ఆప్‌ నిధులు అందుకుందనే ఆరోపణలపై హోం శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.

 ఇందులో ఆప్‌కు చెందిన మరో నేత దివంగత కపిల్‌ భరద్వాజ్‌ పేరు కూడా ఉంది. ఆప్‌ ఓవర్సీస్‌ ఇండియా పేరుతో ఏర్పాటైన విభాగానికి అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో వలంటీర్లు ఉన్నారని తెలిపింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించి దుర్గేశ్‌ పాఠక్, కపిల్‌ భరద్వాజ్‌లకు పంపినట్లు ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. కాగా, విచారణకు అవసరమైతే పార్టీ అగ్ర నేతలను కూడా ప్రశ్నించే అవకాశముందని సీబీఐ వర్గాలు తెలిపాయి. సోదాలపై దుర్గేశ్‌ స్పందించారు. గుజరాత్‌లో పార్టికి పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే కేంద్ర ప్రభుత్వం తనను బెదిరించేందుకు ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు. 

గురువారం ఉదయం ఆరుగురు సీబీఐ అధికారులు తన నివాసానికి వచి్చ, రెండు గదుల్లో దాదాపు 4 గంటల పాటు అణువణువూ గాలించారని, వారికేమీ దొరకలేదని ఆయన చెప్పారు. సెర్చ్‌ వారెంట్‌ చూపిన అధికారులు సోదాలకు కారణం మాత్రం చెప్పలేదన్నారు. భయపెట్టడం ద్వారా గుజరాత్‌లో తమ పార్టీని ఏకాకిని చేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు. తమ పార్టీని అంతం చేయడమే బీజేపీ ఉద్దేశమని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. దుర్గేశ్‌కు గుజరాత్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎ న్నికల బాధ్యతలను అప్పగించిన వెంటనే బీ జేపీ ప్రభుత్వం దాడులకు దిగిందని ఆప్‌‡ నేత మనీశ్‌ సిసోడియా ఆరోపించారు.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)