Breaking News

రుబయ్యా సయీద్‌ కిడ్నాప్‌ కేసు..

Published on Tue, 12/02/2025 - 06:04

న్యూఢిల్లీ: 1989లో అప్పటి కేంద్ర హోం మంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబయ్యా కిడ్నాప్‌ కేసులో కుట్రధారుగా భావిస్తున్న షఫత్‌ అహ్మద్‌ షంగ్లూను సీబీఐ సోమవారం అరెస్ట్‌ చేసింది. నిషేధిత జేకేఎల్‌ఎఫ్‌తో ప్రమేయమున్న ఈ కిడ్నాప్‌ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తాజాగా పట్టుబడిన షంగ్లూ జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌కు సన్నిహితుడు. రుబయ్యా సయీద్‌ కిడ్నాప్‌కు షంగ్లూ, యాసిన్‌ మాలిక్‌ కలిసి కుట్ర పన్నారు.

 35 ఏళ్లుగా ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. వీరిపై రణ్‌బీర్‌ పీనల్‌ కోడ్‌తోపాటు 1989నాటి టాడా చట్టం కింద కేసులున్నాయని సీబీఐ తెలిపింది. షంగ్లూ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉందని పేర్కొంది. ఇతడిని జమ్మూలోని టాడా కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించింది. జేకేఎల్‌ఎఫ్‌ ఆర్థిక వ్యవహారాలన్నీ షంగ్లూ యాజమాన్యంలోనే సాగేవని అధికారులు చెప్పారు. 

శ్రీనగర్‌లోని నిషాత్‌ ప్రాంతంలోని తన నివాసంలో ఉన్న షంగ్లూను సీబీఐ, కశీ్మర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారని వివరించారు. జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ 2019 నుంచి తిహార్‌ జైలులో ఉండటం తెల్సిందే. రుబయ్యా సయీద్‌ను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు.. జైలులో ఉన్న ఐదుగు రు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో, అప్పట్లో బీజేపీ మద్దతుతో కేంద్రంలో ఉన్న వీపీ సింగ్‌ ప్రభుత్వం అందుకు తలొగ్గడంతో కథ సుఖాంతమైంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)