Breaking News

ట్రైనీ డాక్టర్‌ కేసు.. ఆర్‌జీకార్‌ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్‌ ఆగ్రహం

Published on Tue, 08/13/2024 - 14:04

కోల్‌కతా:  జూనియర్‌ డాక్టర్‌ మరణంపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  ఆర్​జీ కార్​ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ​ఘోష్​​ దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని సూచించింది. 

జూనియర్‌ డాక్టర్‌ మరణంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బాధితురాలు తల్లిదండ్రులుతో పాటు పలువురు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ (ఆగస్ట్‌ 13 న)  చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థిని అత్యాచారం, హత్యపై సందీష్‌ ఘోష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌జీకార్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై సందీష్‌ ఘోష్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆయన తీరుపై మండిపడింది.  

డాక్టర్‌ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది.  విద్యార్ధులు, ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కానీ సందీష్‌ ఘోష్‌ ఎలాంటి స‍్పందన లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. 

ఈ సందర్భంగా ‘ఆర్‌జీ కార్‌ కాలేజీ విద్యార్ధులకు ప్రిన్సిపల్ సంరక్షకుడు .. అతను సానుభూతి చూపకపోతే ఎవరు చూపిస్తారు? ఆయన ఎక్కడా పని చేయకుండా ఇంట్లోనే ఉండాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం వ్యాఖ్యానించారు. 

ఏ వ్యక్తి చట్టానికి అతీతులు కారు. మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ ఘోష్ రాజీనామా లేఖను కోర్టుకు అందజేయాలి. ఆ లేఖలో ఘోష్‌ ఏం రాశారో మేం చదవాలని అనుకుంటున్నామని ఆదేశాలు జారీ చేశారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)