Breaking News

ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లు

Published on Thu, 11/30/2023 - 05:47

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్‌ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కలి్పస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు.

మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

కమిషన్‌ 2025 అక్టోబర్‌ అంతానికల్లా నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్‌ నిర్ణయించింది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)