Breaking News

ఎన్నికలు ముగిసే వరకూ ఆహార భద్రత !

Published on Fri, 08/18/2023 - 04:55

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ తర్వాత సైతం కొనసాగించే అవకాశాలున్నాయని కేంద్రప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.  రాజకీయ కారణాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పథకం ద్వారా 81 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం ప్రతి నెల ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. నిజానికి ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ ఏడాది డిసెంబర్‌ వరకు కొనసాగించాలని కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే నిర్ణయించడం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత బియ్యం పథకాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని అధికార బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది.

గతంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు అండగా నిలిచిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించి ఈసారీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటే ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రెండేళ్లుగా ఏడాది గరిష్టంగా ఒక్కో రీఫిల్‌కు రూ.200 సబ్సిడీ చొప్పున 12 సిలిండర్లను రాయితీ ధరకు అందిస్తోంది. వంటగ్యాస్‌ ధరలు ఎక్కువ స్థాయిలోనే కొనసాగితే ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)