Breaking News

రూ.24,634 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

Published on Tue, 10/07/2025 - 16:59

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రూ.24,634 కోట్ల విలువైన నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాలను అనుసంధానం చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు ప్రస్తుత భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను సుమారు 894 కి.మీ.  మేరకు విస్తరించనున్నాయి.

నాలుగు ప్రాజెక్టులు ఇవే..
వార్ధా - భూసావల్ - 3వ, 4వ లైన్ - 314 కి.మీ (మహారాష్ట్ర)
గోండియా - డోంగర్‌గఢ్ - 4వ లైన్ - 84 కి.మీ (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్)
వడోదర - రత్లం - 3వ, 4వ లైన్ - 259 కి.మీ (గుజరాత్, మధ్యప్రదేశ్)
ఇటార్సి - భోపాల్ - బినా 4వ లైన్ - 237 కి.మీ. (మధ్యప్రదేశ్)

కేబినెట్‌ ఆమోదం పొందిన ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 3,633 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతుంది. ఇది దాదాపు 85.84 లక్షల జనాభాకు ప్రయోజనం కలిగించనుంది. పెరిగిన ఈ రైల్వే లైన్ సామర్థ్యం భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణను అందిస్తుంది. ఈ ప్రాజెక్టులు ప్రయాణికులు, వస్తు సేవలకు సమర్థవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి.

ఈ నూతన ప్రాజెక్టు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కాలోని రాక్ షెల్టర్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ మొదలైన ప్రముఖ గమ్యస్థానాలకు రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఇది పర్యాటకులకు అనువైన రవాణా మార్గాన్ని అందించనుంది. బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యాలు, ఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టు ఉపకరించనుంది. రైల్వే లైన్‌ సామర్థ్యం పెంపుదల కారణంగా ఫలితంగా 78 ఎంటీపీఏ(సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరుకు రవాణా జరగనుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)