Breaking News

BSNL నుంచి అదిరిపోయే ప్లాన్‌.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే

Published on Tue, 02/11/2025 - 07:46

మొబైల్‌ ఫోను వినియోగదారుల కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. 365 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఎంతో చౌకైనది కూడా. ఈ ప్లాన్‌ తీసుకునే వినియోగదారులకు రోజుకు రూ. 3 మాత్రమే ఖర్చవుతుంది. 4జీ నెట్‌వర్క్‌పైపు వేగంగా అడుగులు వేస్తున్న బీఎస్‌ఎన్‌ల్‌ అందిస్తున్న ఈ ప్లాన్‌ మొబైల్‌ ఫోను వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఈ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.1,198. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగించే వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా రూ. 100 వరకూ ఖర్చవుతుంది.

ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు  అందుబాటులో ఉంటాయి. అలాగే వినియోగదారులు ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటా ప్రయోజనాన్ని  అందుకుంటారు. ప్రతి నెలా 30 ఉచిత SMSల ప్రయోజనం  పొందుతారు. ఉచిత జాతీయ రోమింగ్‌ కూడా ఈ ప్లాన్‌లో ఉంది. భారతదేశం అంతటా రోమింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చు.

కాగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ.6,000 కోట్ల ప్రోత్సాహాన్ని  అందించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్- ఎంటీఎన్‌ఎల్‌ల 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అదనపు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలో ఈ రెండు టెలికాం కంపెనీల వినియోగదారులు పూర్తిస్థాయిలో  4జీ సేవలను అందుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Nepal: 23 మంది భారతీయులు అరెస్ట్.. కారణం ఇదే..
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)