Breaking News

‘మన్ కీ బాత్‌’లో వినతి.. భారత శునక జాతులకు బీఎస్‌ఎఫ్‌ శిక్షణ

Published on Thu, 09/25/2025 - 20:54

న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) దేశ సరిహద్దుల్లో మోహరింపునకు భారత శునక జాతులను ఎంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 20 జాతులకు చెందిన 150 శునకాలకు శిక్షణ అందించింది. ఈ జాతులలో రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ ప్రధానంగా ఉన్నాయి. శునకాలను దత్తత తీసుకోవాలనుకుంటున్నవారు భారత శునక జాతులను ఎంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’లో కోరారు. దీనిని అమలు చేసేందుకు బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.

‘మన్ కీ బాత్’లో ప్రధాని వినతి దరిమిలా బీఎస్ఎఫ్ భారత శునక జాతి కుక్కలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ఇప్పటివరకు మేము 150 భారత జాతి శునకాలకు శిక్షణ ఇచ్చాం. వాటిని సరిహద్దుల్లో మోహరించాం. 20 శునకాలు బ్రీడింగ్ సెంటర్‌లో ఉన్నాయి’ అని టెకాన్‌పూర్‌లోని బీఎస్ఎఫ్ అకాడమీ ఏడీజీ, డైరెక్టర్ షంషేర్ సింగ్ తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత పలు ఛాంపియన్‌షిప్‌లలో విదేశీ జాతి శునకాలను ఓడించిన భారత జాతి శునకం ‘రియా’ కథను  సింగ్ పంచుకున్నారు.

‘ఇక్కడ రియా అనే కుక్క ఉంది. దానిని ఇక్కడే పెంచి, శిక్షణ ఇచ్చారు. 2024లో దానికి ఉత్తమ ట్రాకర్ డాగ్ అవార్డు వచ్చింది. ఛాంపియన్‌షిప్‌లో  అది పలు విదేశీ జాతి శునకాలను ఓడించి, ఉత్తమ శునకం అవార్డు గెలుచుకుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ సాధించిన విజయం. మేము రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ జాతులకు శిక్షణ ఇస్తున్నాం. ఇవి చాలా చురుకుగా ఉంటాయి.  ఎత్తు నుండి దూకేటప్పుడు  ఇతర జాతుల శునకాల కంటే చాలా మెరుగ్గా స్పదిస్తాయి. మేము సరిహద్దు వద్ద దాదాపు 700 కుక్కలను మోహరించాం’ అని ఆయన తెలిపారు.

2020లో ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విపత్తు నిర్వహణ, రెస్క్యూ ఆపరేషన్లలో గణనీయమైన కృషి చేసినందుకు భారత జాతి శునకాలను ప్రశంసించారు. ఈ శునకాలకు దేశంలోని వివిధ సవాళ్లతో కూడిన పనులకు  అనువైనవన్నారు. భారత శునక జాతులు దేశ పర్యావరణం, వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)