Breaking News

అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్‌ భూషణ్‌

Published on Wed, 05/31/2023 - 10:26

ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్‌ మెడల్స్‌ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్‌ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. 

ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్‌ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్‌ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్‌కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్‌కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు.    

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్‌‌ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్‌ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు.

ఈ క్రమంలో గంగలో మెడల్స్‌ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్‌ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్‌ తికాయత్‌ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్‌పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)