Breaking News

Darjeeling: కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం.. శిథిలాల కింద మరింత మంది..

Published on Sun, 10/05/2025 - 10:10

డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిరిక్- కుర్సియాంగ్  పర్యాటక ప్రదేశాలను కలిపే దుడియా ఐరన్ వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండచరియలు విరిగిపడ్దాయి.

ఉత్తర బెంగాల్ అంతటా  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమయ్యింది.  డార్జిలింగ్‌లోని మిరిక్, సుఖియా పోఖారిలలో కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పశ్చిమ బెంగాల్ - సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్- సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్పైగురి, సిలిగురి, కూచ్‌బెహార్‌లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చిత్రే, సెల్ఫీ దారా తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో  జాతీయ రహదారి-10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

సోమవారం ఉదయం వరకు పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి, అలీపుర్దువార్ జిల్లాలలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్‌ ప్రకటించారు. ఉత్తర బెంగాల్‌లోని పొరుగు జిల్లా అలీపుర్దువార్‌లో సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.

పశ్చిమ జార్ఖండ్, దక్షిణ బీహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల  మీదుగా ఆవరించిన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా బీహార్ వైపు కదిలి, క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముర్షిదాబాద్, బిర్భూమ్, నదియా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గత 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి  ఓ మోస్తరు వర్షాలు కురిశాయని, బంకురాలో అత్యధికంగా 65.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)