రూ. 69 వేలా? అంత సీన్‌ లేదు : రూ. 5లకే కొనొచ్చు!

Published on Sat, 11/08/2025 - 14:50

ఇటీవలి కాలంలో ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్  ప్రాడా లగ్జరీ బ్యాగులు, చెప్పులు,లంచ్‌బాక్స్‌ ఇలా వివిధ రకాల వింత వింత డిజైన్లలో ఉత్పత్తులను లాంచ్‌ చేసింది.  తాజాగా  లగ్జరీబ్రూచ్ (సేఫ్టీ పిన్‌)ను పరిచయం చేసింది. దీని ధర  గురించి తెలుసుకుని జనం షాకవుతున్నారు.  అతి సాధారణ పిన్సీసు లాంటి దానికోసం  అంత డబ్బు వెచ్చించాలా అని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై  తెగ చర్చ జరుగుతోంది.

ప్రాడా అనే సంస్థ ఏకంగా 775 డాలర్లకు (రూ. 68758)  విలువతో దీన్ని లాంచ్‌  చేసింది. సుమారు 3.15 అంగుళాల పొడవులో  రంగురంగుల క్రోచెట్ దారంతో రూపొందించిన ఈ బ్రూచ్ మూడు రంగుల కలయికలలో లభిస్తుందని కంపెనీ ప్రకటించుకుంది.  అయితే దుకాణాలలో సాధారణంగా 15 నుండి 20 ప్యాక్‌కు దాదాపు రూ. 10 ఖర్చవుతుంది.69వేల రూపాయలా? నేను దీన్ని చాందిని చౌక్‌లో రూ. 5 కి అదే కొన్నాను మరికొందరు వ్యాఖ్యానించారు. దీన్ని ఏ రంగుతోనైనా తయారు చేయగలను, సేఫ్టీ పిన్ రంధ్రం కోసం బంగారాన్ని కూడా ఉపయోగిస్తాను అని ఒకరు, ఈ  డబ్బుతో మొత్తం గదినినింపేసే అన్ని పిన్స్‌ కొంటాను అని మరొకరు... ఇలా తలా ఒక రకంగా ఈ బ్రూచ్‌ను ఎగతాళి  చేశారు.

 కాగా లగ్జరీ బ్రాండ్‌  ప్రాడా ఆటో మోడల్‌లో బ్యాగ్‌, రూ. 1.2 లక్షల ధరతో కొల్హాపురి-శైలి చెప్పులను తీసుకురావడం వార్తల్లో  నిలిచింది.  మహారాష్ట్ర సాంప్రదాయ చేతితో తయారు చేసిన   షోలాపురి  చెప్పులకు కాపీ అంటూ  విమర్శలు చెలరేగాయి. చేతివృత్తులవారికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తమైంది. ప్రాడా తమ డిజైన్‌ను కాపీ చేసినట్లు ఆరోపిస్తూ భారతీయ కళాకారులకు ద్రవ్య పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)