Breaking News

సన్యాసిగా మారిన వ్యక్తి ఆర్‌బీఐ బాండ్ల బదిలీకి బాంబే హైకోర్టు నో

Published on Sat, 03/01/2025 - 08:48

ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆర్‌బీఐ బాండ్లను తమకు బదిలీ చేయాలంటూ అతడి భార్య, తల్లి వేసిన రిట్‌ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించడమంటే మరణంతో సమానమని, అతడి ఆస్తులకు తామే వారసులమవుతామన్న వారి వాదనలను తోసిపుచ్చింది. 

మనోజ్‌ జవెర్‌చంద్‌ దెధియా అతడి కుమార్తె, కుమారుడు జైన సన్యాసం స్వీకరించి, సాధువులుగా మారారు. పేర్లను సైతం మార్చుకున్నారు. అయితే, 2022 నవంబర్‌లో మనోజ్‌ సన్యాసం తీసుకోకమునుపు, తన పేరుతో ఉన్న ఆర్‌బీఐ బాండ్లను ట్రాన్స్‌ఫర్‌ చేసే విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులను సంప్రదించారని పిటిషనర్ల లాయర్‌ హితేశ్‌ సోలంకి కోర్టుకు తెలిపారు.

 తమ నిబంధనల ప్రకారం సన్యాసమంటే మరణంతో సమానం కాదని వారు ఆయన వినతిని తిరస్కరించారన్నారు. స్పందించిన ధర్మాసనం.. కేవలం సన్యాసం స్వీకరించిన ఫొటోలు, ఆహ్వాన పత్రికలుంటే చాలదని, అందుకు అనుగుణమైన క్రతువులు జరిపినట్లు ఆధారాలు చూపాల్సి ఉందంది. ఈ వ్యవహారంపై సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)