Breaking News

గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబు బెదిరింపు..

Published on Sat, 08/17/2024 - 14:12

హర్యానాలోని గురుగ్రామ్‌ నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్‌ బెదిరింపు అందింది. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్‌కు శనివారం ఈ మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్‌ అధికారులు.. బిల్డింగ్‌ నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ మాల్‌ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు.

అయితే మాల్ మేనేజ్‌మెంట్‌కు వచ్చిన మెయిల్‌లో.. బిల్డింగ్‌లో బాంబులు అమర్చినట్లు, మాల్‌లోని ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మాల్‌లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు గుర్తించలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.

మరోవైపు నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం మాల్‌ను ఖాళీ చేసి తనిఖీ చేశారు. మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీసు బృందాలు పాల్గొన్నాయని చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)