Breaking News

‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు: అమ్మ, మామ కలసి.. దడ పుట్టిస్తున్న బాలుని సాక్ష్యం

Published on Wed, 08/20/2025 - 09:18

అల్వార్‌: రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకున్న ‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు మరోమలుపు తిరిగింది. ఈ ఉదంతంలో మృతుని కుమారుడే కీలక సాక్షిగా నిలిచాడు. ఆగస్టు 15న ఈ ఘటన వెలుగు చూసింది. అ‍ల్వార్‌లోని ఒక ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన వస్తుండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఒక నీలిరంగు డ్రమ్ములో కుళ్లిన స్థితిలో హన్స్‌రాజ్ అనే వ్యక్తి మృతదేహం బయటపడింది.

ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. మృతుని ఎనిమిదేళ్ల కుమారుడు హర్షల్ కీలక సాక్షిగా నిలిచాడు. తమ ఇంటిలో నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే నీలిరంగు డ్రమ్ములో తన తండ్రి మృతదేహాన్ని తన తల్లి, ఆమె ప్రియుడు ఉంచారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు.  మృతుడు  హన్స్‌రాజ్ పెద్ద కుమారుడు హర్షల్ తన తండ్రి హత్యకు ముందు, ఆ తరువాత  ఇంట్లో ఏమి జరిగిందో పోలీసులకు వివరంగా తెలియజేశాడు.

‘ఆరోజు మా నాన్న, అమ్మ, మామ (వారి ఇంటి యజమాని కొడుకు) కలిసి మద్యం సేవిస్తున్నారు. మా అమ్ము రెండు పెగ్గులు మాత్రమే తాగింది. మామ ఫుల్‌గా తాగాడు. నాన్న కూడా  మద్యం మత్తులోనే ఉండి,  అమ్మను కొట్టడం  మొదలుపెట్టాడు. ఇంతలో మామ జోక్యం చేసుకున్నాడు. అయితే మా నాన్న.. నువ్వు ఆమెను కాపాడితే, నిన్ను కూడా చంపేస్తాను’ అని అరిచాడు. వెంటనే మామ మా నాన్నపై దాడి చేశాడు. ఇంతలో అమ్మ మమ్మల్ని నిద్రపోమని చెప్పింది.

కాసేపటికి నేను మేల్కొని చూడగా, అమ్మ, మామ ..మా నాన్న మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో పెట్టి, వంటగదిలో ఉంచారు. అప్పుడు నేను వారిని ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. వారు తన తండ్రి చనిపోయారని చెప్పారు. మా నాన్న అమ్మను తరచూ కొట్టేవాడు. సిగరెట్లతో కాల్చాడు. నన్ను కూడా కొట్టేవాడు. ఆగస్టు 15న బ్లేడుతో నా మెడపై గాయం చేశాడు’ అని హర్షల్ తెలిపాడు.

ఈ దారుణ హత్య ఆగస్టు 15న జరిగిందని, ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన రావడాన్ని గమనించి ఫిర్యాదు చేసిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. హన్స్‌రాజ్ భార్య సునీత, ఆమె ప్రియుడు జితేంద్ర శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. తరువాత హన్స్‌ రాజ్‌ మృతదేహాన్ని  డ్రమ్ములో ఉంచి, దానిని ఉప్పుతో నింపారని పోలీసులు పేర్కొన్నారు. సునీత, శర్మ నాలుగు నెలలుగా రిలేషన్‌ షిప్‌లో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నదని వారు పేర్కొన్నారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)