Breaking News

పన్నెండేళ్లకోసారి నీలి సముద్రంలా మెరిసే కొండలు… నీలకురింజి మాయ!

Published on Tue, 02/10/2026 - 14:57

ఒక్క సారి ఊహించండి… మొత్తం కొండ అంతా  ఒక్కసారిగా నీలిరంగు సముద్రంలా మారిపోతే ఎలా ఉంటుంది? అది ప్రకృతి సృష్టించిన నిజమైన అద్భుతం. అదే – నీలకురింజి!

మనకు పుష్కరాలు పన్నెండేళ్లకోసారి వస్తాయి కదా… అలానే ఈ నీలకురింజి పూలు కూడా పన్నెండేళ్లకు ఒక్కసారే పూస్తాయి. ఒకేసారి విరబూసి, ఆ తర్వాత మళ్లీ పదేళ్లకు పైగా ఈ పువ్వులు  కనిపించవు.

సముద్ర మట్టానికి 1300 నుంచి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు… పూయగానే కొండలన్నీ నీలి-ఊదా రంగులో మునిగిపోతాయి. ఆ దృశ్యం చూడటానికి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి ‘నీలగిరి’ పర్వతాలు అనే పేరు వచ్చిందని ప్రతీతి. అదే నీలగిరి కొండల మధ్యలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీ  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.   పశ్చిమ కనుమల ఎత్తైన కొండలపై  కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అద్భుతం కనిపిస్తుంది. టొడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు.ఈ తెగల సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈ పూలకు ప్రత్యేక స్థానం ఉంది.

చివరిసారి 2018లో ఈ పూలు పూశాయి. మళ్లీ 2030లో ఈ నీలి పూలతో కొండలు అందంగా కనిపిస్తాయి.ఊటీ, నీలగిరి ప్రాంతాలు మరోసారి నీలి తివాచీ పరచుకున్నట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అక్కడికి వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు అది జీవితంలో ఒకసారి చూసే అద్భుత దృశ్యం అవుతుంది. కానీ… ఈ అందమైన అద్భుతం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. టీ, కాఫీ తోటల విస్తరణ… పెరుగుతున్న పర్యాటకం… అడవుల నాశనం… ఇవన్నీ నీలకురింజి ఆవాసాలను క్రమంగా తగ్గిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబాబుదాన్ గిరి, కుడ్రేముఖ్, నీలగిరి ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని అత్యంత కీలకమైన జాతిగా గుర్తించింది.ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అరుదైన బహుమతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.2030లో ఊటీ నీలగిరి కొండలు మళ్లీ నీలి సముద్రంలా మెరిసే దృశ్యం చూడాలంటే… మనం ఇప్పుడే ప్రకృతిని రక్షించాలి.ఎందుకంటే… నీలకురింజి కేవలం ఒక పువ్వు కాదు… పన్నెండేళ్ల సహనానికి ప్రతీక!
 

 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు