Breaking News

మీ టైం బాగోలేదు.. ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి..!

Published on Sun, 08/02/2026 - 08:15

బెంగళూరు: ఇంట్లో దుష్టశక్తి తిష్ట వేసింది, దానిని తొలగించడానికి పూజలు చేస్తానని ఓ మహిళను నమ్మించి రూ.2.50 కోట్ల నగదును కాజేశాడో నకిలీ బాబా. ఈ ఘటన బెంగళూరు సిటీ చామరాజపేటెలో వెలుగుచూసింది. బాధితురాలు కుముద స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేయగా, నకిలీబాబా అఫ్సర్‌ పాషా, మధ్యవర్తులు శంకర్, భరత్‌ పై  కేసు నమోదైంది. 

వివరాలు.. కుముద కుటుంబంతో జీవిస్తోంది. తన ఇంటిపై రుణం తీసుకోవాలని అనుకుని తెలిసినవారి ద్వారా లోన్‌ ఏజెంట్లు భరత్, శంకర్‌లతో మాట్లాడింది. కుముద కుమారుడు బైకు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇది తెలిసి భరత్, శంకర్‌ ఆమెను.. మీ టైం బాగాలేదేమో, ఇంట్లో దుష్టశక్తులు ఉండటంతో ఇలా అయ్యింది, మాకు ఒక బాబా తెలుసు, ఆయనతో క్షుద్ర పూజలు చేయిస్తే ఆటంకాలన్నీ పోతాయి అని మభ్యపెట్టారు.  అలా మొదట రూ.8 లక్షలు తీసుకుని పూజచేయించారు.  

రూ.505 కోట్లు వస్తాయని..  
తనకు రిజర్వుబ్యాంకు నుంచి రూ.505 కోట్లు రావాల్సి ఉంది, అది విడిపించుకోవడానికి రూ.2.50 కోట్ల ఫీజులు చెల్లించాలి, మీరు ఇళ్లు విక్రయించిన డబ్బు ఇస్తే పని పూర్తయ్యాక రూ.10 కోట్ల ప్రతిఫలం ఇస్తానని బాబా ఆమెను ప్రలోభపెట్టాడు.  

సరేనన్న కుముద తన ఇంటిని రూ.8.50 కోట్లకు అమ్మేసి, అందులో నుంచి రూ.2.50 కోట్లు నకిలీ బాబాకు ముట్టజెప్పింది. నగదు అందగానే నకిలీబాబా, ముఠా మాటమార్చారు. ఏవో సాకులు చెబుతూ తప్పించుకునేవారు. కుముద డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో చంపేస్తామని బెదిరించారు. మోసపోయినట్లు గుర్తించిన కుముదా సీసీబీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉండగా  గాలిస్తున్నారు.  

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)