Breaking News

బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్‌వాదీ ఎంపీ

Published on Mon, 06/24/2024 - 08:42

యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్‌ అన్నారు.

అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్‌ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్‌ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్‌లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.

అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి విజువల్స్

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)