Breaking News

తల్లిదండ్రుల వల్లే నరకం.. వీడిన బెంగళూరు ఫ్యామిలీ డెత్‌ కేస్‌ మిస్టరీ

Published on Wed, 01/08/2025 - 10:41

యశ్వంత్ పుర : అమ్మా నాన్న మాట్లాడడం లేదు. నేను కష్టంలో ఉంటే ఎవరూ చేయి పట్టడం లేదు.. అనే ఆవేదనే టెక్కీ కుటుంబం ఉసురు తీసింది. బెంగళూరు సదాశివనగర ఆర్‌ఎంవీ లేఔట్‌లో ఆదివారం రాత్రి ఇద్దరు పిల్లలను చంపి, ఆపై టెక్కీ దంపతులు ఆత్మహత్య చేసుకున్న కేసులో డెత్‌నోట్‌లో వారి ఆవేదన అందరికీ కంటనీరు తెప్పింది. మానవ సంబంధాలు ఎలా పతనమవుతున్నాయో చాటింది. టెక్కీ అనూప్, భార్య రాఖి తమ పిల్లలు అనుప్రియా, ప్రియాంశ్‌లకు విషాహారం పెట్టి హత్య చేసి ఆపై వారు ఉరి వేసుకొన్నారు. అనూప్‌ ఒక పేజీ డెత్‌నోట్‌ను రాసి తన సోదరునికి ఈ మెయిల్‌ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

ఎలా ఉన్నావు అనేవారు లేరు 
అనూప్‌ ఉద్యోగరీత్యా ఉత్తరప్రదేశ్‌ నుంచి బెంగళూరుకు వచ్చాడు. అనూప్‌ టెక్కీ కాగా, రాఖీ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేసేది. ఇద్దరూ వర్క్‌ ఫ్రం హోంలో పని చేస్తున్నారు. రాఖీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ కారణంతో తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్వీకరించలేదు. మాట్లాడితే, ఆస్తిని అడుగుతాడని అనుమానించేవారని లేఖలో రాశాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా ఎవరూ మాట్లాడింది లేదు. 

కుటుంబీకులు ఒక్కరూ వీడియో కాల్‌ చేసి పలకరించలేదు. దీంతో నా భార్య మానసికంగా కుంగిపోయింది. కూతురు అనుప్రియాకు బుద్ధిమాంద్యం ఉండేది.  అందువల్ల నేను, రాఖీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఎవరూ మాకు ధైర్యం చెప్పలేదు అని బాధను వెళ్లబోసుకున్నాడు. పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని అనూప్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. మృతదేహాలను ఆస్పత్రిలో భద్రపరిచారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)