Breaking News

Birsa Munda Jayanti: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగి..

Published on Fri, 11/15/2024 - 10:12

నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, ప‌ది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీల‌ను స‌మీక‌రించి, వారిని చైత‌న్య‌వంతులను చేశాడు.  ఆదివాసీల స‌మూహాన్ని ఏర్పాటు చేసి, అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.

అటవీ ‍ప్రాంతంలోని గిరిజ‌నుల భూముల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించే చ‌ట్టాల‌ను ప్ర‌వేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవ‌లం 25 ఏళ్లు మాత్ర‌మే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజ‌న నాయ‌కునిగా, స్వాతంత్ర స‌మ‌ర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు ప‌క్క‌ల నివసించిన ఈయన జాతీయ ఉద్య‌మంపై ఎన‌లేని ప్ర‌భావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ‍ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

1875, న‌వంబ‌ర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్ర‌మించాడు. క్రైస్త‌వ మ‌తాన్ని స్వీక‌రించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిష‌నరీకి, ఆంగ్లేయుల ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజ‌నుల‌కు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడ‌విలో నిద్రిస్తున్న స‌మ‌యంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు. 

ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు.. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)