Breaking News

తెలుగు ఐపీఎస్‌ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published on Tue, 10/14/2025 - 20:02

భోపాల్‌: హర్యానాలో తెలుగు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది.  ఆత్మహత్యకు ముందు పూరాన్‌ కుమార్‌ తన మరణానికి కారణమైన పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు రాశారు. వారిలో ఒకరైన రోహత్‌క్‌ సైబర్‌ సెల్‌ ఏఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సందీప్‌ కుమార్‌ సైతం ‘సత్యం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం రేపుతోంది.

రోహ్‌తక్‌లోని ఓ పొలంలో సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియో,మూడుపేజీల సూసైడ్‌ నోట్‌ రాశారు. ఆ నోట్‌లో ‘ఐపీఎస్‌ పూరన్ కుమార్‌ అవినీతి పోలీసు అధికారి. తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూరన్ కుమార్‌ బదిలీ అయ్యారు. 

ఐపీఎస్‌ అధికారి గన్‌మెన్ మద్యం కాంట్రాక్టర్ నుండి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా నేనే పట్టుకున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్ బెదిరించడంతో కాంట్రాక్టర్ పూరన్‌ కుమార్‌ను కలిశాడు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు.. ఐపీఎస్ అధికారి దానికి కులం రంగు పులిమేందుకు ప్రయత్నించారు. 

పూరన్‌ కుమార్‌ను రోహ్‌తక్ పరిధిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అవినీతికి అంతులేకుండా పోయింది. రోహ్‌తక్‌లో బాధ్యతలు చేపట్టి నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించడం ప్రారంభించారు. సదరు అధికారులు బ్లాక్‌మెయిల్‌ చేయడం, పిటిషనర్లకు ఫోన్ చేసి, డబ్బులు అడిగి వారిని మానసికంగా హింసించేవారు. బదిలీలకు బదులుగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారు. 

‘ఐపీఎస్‌ పూరన్‌ కుమార్‌ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అతనిపై వచ్చిన ఫిర్యాదులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది కుల సమస్య కాదు. నిజం బయటకు రావాలి. అతను అవినీతిపరుడు. ఈ నిజం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్వపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు’ అంటూ తన బలవన్మరణానికి ముందు సైబర్‌ సెల్‌ ఏఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న పదిమంది అధికారులలో ఒకరైన రోహ్‌తక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను ప్రశంసించారు. వెనువెంటనే బిజార్నియా రోహ్‌తక్‌ నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సమాచారం. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)