Breaking News

రెచ్చిపోయిన ర్యాపిడో డ్రైవర్‌.. మహిళకు చెంపదెబ్బ.. వీడియో వైరల్‌

Published on Mon, 06/16/2025 - 16:02

సాక్షి,బెంగళూరు: సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు. సిగ్నల్‌ ఎందుకు జంప్‌ చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి మహిళ ప్యాసింజర్‌పై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.   

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జూన్‌ 14న  చోటు చేసుకుంది. జ్వులెరీ షాపులో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు ఘటన జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్‌ చేసుకుంది.

ర్యాపిడో కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరింది. మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడమే కాదు సిగ్నల్‌ జంప్‌ కూడా చేశాడు. ఇదే విషయాన్ని బాధితురాలు సదరు ర్యాపిడో డ్రైవర్‌ను ప్రశ్నించింది. దీంతో కోపోద్రికుడైన ర్యాపిడో డ్రైవర్‌ జయనగర్‌లోని ఓ ప్రాంతంలో బైక్‌ను ఆపేశాడు. డబ్బులు చెల్లించాలని తగువు పెట్టుకున్నాడు.

అందుకు మహిళ ఒప్పు కోలేదు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వహించారని మండిపడింది. తాను డబ్బులు,హెల్మెట్‌ ఇవ్వనంటూ బాధితురాలు ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తుండగా.. నిందితుడు మాత్రం కన్నడంలోనే సమాధానం ఇస్తున్నాడు.  వారిద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరడంతో స్థానికులు వాళ్ళిద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్‌ మహిళా ప్యాసింజర్‌పై చేయి చేసుకున్నాడు.  

ఆ మహిళ ఫిర్యాదుతో  సదరు ర్యాపిడో డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కానీ ఆమె ఈ వివాదాన్ని   కొనసాగించడానికి ఇష్టపడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ కారణాల్ని ఎత్తి చూపుతూ ద్విచక్ర వాహన ట్యాక్సీ సేవల్ని నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘మూడు నెలల క్రితం, కోర్టు బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని కోర్టు నిర్ణయించింది. అమలుకు ఆరు వారాల సమయం ఇచ్చారు. మళ్ళీ, గడువు పొడగించాలని ప్రభుత్వం అభ్యర్ధించడంతో మరో ఆరు వారాల సమయం పొడిగించింది. ఇప్పుడు, 12 వారాలు ముగిశాయి. అగ్రిగేటర్లు హైకోర్టు ఆదేశాన్ని పాటించాలి’అని కర్ణాటక రవాణా మంత్రి రామలింగ రెడ్డి అన్నారు.

దేశంలోని టెక్ హబ్ అయిన బెంగళూరులో భారీ బైక్ టాక్సీలు ఉన్నాయి. మార్కెట్‌ వాటాలో ర్యాపిడో 60శాతం వాటాను కలిగి ఉంది. రోజుకు 16.5 లక్షల రైడ్‌ సర్వీస్‌లను అందిస్తుంది. బైక్ టాక్సీలు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 1.5 లక్షల మంది గిగ్ కార్మికులను నియమించాయి.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)