Breaking News

యాడ్‌తో టైమ్‌ వేస్ట్‌ చేశారు

Published on Thu, 02/20/2025 - 06:14

బెంగళూరు: పీవీఆర్‌ ఐనాక్స్, బుక్‌మై షోలపై ఓ యువకుడు కోర్టుకెక్కాడు. సుదీర్ఘమైన వాణి జ్య ప్రకటనలతో తన సమయాన్ని వృథా చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపిస్తూ కేసు వేశాడు. అతనికి రూ.65 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది! ఈ ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన అభిషేక్‌ ‘సామ్‌ బహదూర్‌’సినిమా కోసం బుక్‌మై షోలో మూడు టికెట్లు కొన్నాడు. సాయంత్రం 4.05కు మొదలవాల్సిన సినిమా కాస్తా ఏకంగా 30 నిమిషాలు సినిమా ప్రకటనలు, ట్రైలర్ల ప్రసారంతో 4.30కు మొదలైంది. దాంతో సకాలంలో ఆఫీసుకు వెళ్లలేకపోయానని అభిషేక్‌ ఆరోపించాడు. 

‘‘నా విలువైన సమయం వృథా అయింది. ప్రకటనలు ద్వారా ప్రయోజనం పొందడానికి థియేటర్‌ వారు షో టైమింగ్స్‌ను తప్పుగా పేర్కొన్నారు. ఇది అన్యాయం’’అంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. సమయాన్ని డబ్బుగా పరిగణిస్తామని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుకు జరిగిన నష్టాన్ని పీవీఆర్‌ సినిమాస్, ఐనాక్స్‌ పూడ్చాలని పేర్కొంది. అనైతిక వ్యాపార చర్యలకు పాల్పడ్డందుకు, సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు, మానసిక వేదనకు రూ.5 వేలు, ఫిర్యాదు, ఇతర ఉపశమనాలకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. పీవీఆర్‌ సినిమాస్, ఐనాక్స్‌ సంస్థలకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. బుక్‌మైషో కేవలం టికెట్‌ బుకింగ్‌ వేదిక కాబట్టి ఎలాంటి పరిహారమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రకటనల స్ట్రీమింగ్‌ సమయంపై నియంత్రణ లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)