Breaking News

సుశిక్షిత మూగ గూఢచారులు

Published on Wed, 06/04/2025 - 00:58

వాసన పసిగట్టి ప్రమాదాన్ని కనిపెట్టే జాగిలాలను మాత్రమే ఇప్పటి వరకు మనం చూశాం. అయితే పైకి కనిపించని ‘నిగూఢ దళాలు’ కూడా వివిధ దేశాల సైన్యాలలో నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నాయి. అవి మందుపాతరలను కనిపెడతాయి. సముద్ర జలాల్లోని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. సరిహద్దుల్లో చొరబాటు దారులను అడ్డుకుని, వారిపై దాడి కూడా చేస్తాయి. శిక్షణ పొందిన ఈ మూగజీవులు.. ప్రపంచ దేశాల ఆర్మీలకు గొప్ప ‘మార్మిక’ శక్తిగా తోడ్పడుతున్నాయి.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

మహా తెలివైన ‘హీరో ర్యాట్స్‌’
దశాబ్దాల అంతర్యుద్ధంతో మందుపాతరల భూమిగా మారిన కాంబోడియా ఆనాటి మందుపాతరలను కనిపెట్టి, వాటిని శక్తిహీనం చేసేందుకు ఎలుకల సహాయం తీసుకుంటోంది. శిక్షణ పొందిన ‘ఆఫ్రికన్‌ జెయింట్‌ పౌచ్డ్‌ ర్యాట్స్‌’ లేదా ‘హీరో ర్యాట్స్‌’ అనే ఆ ఎలుకలు మందుపాతరలు కచ్చితంగా గుర్తిస్తున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇంకా అనేక యూరోపియన్‌ దేశాల సైన్యాలు కూడా హీరో ర్యాట్స్‌ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ హీరో ర్యాట్స్‌ సబ్‌ సహారా ఆఫ్రికాకు చెందినవి. 

టెక్నాలజీ సైతం పసికట్టలేని టి.ఎన్‌.టి. (ట్రైనైట్రోటోల్యున్‌) వంటి పేలుడు పదార్థాల సూక్ష్మ జాడలను కూడా ఇవి తమ ఆఘ్రాణ శక్తితో గుర్తించగలవు. 45 సెంటీమీటర్ల పొడవైన శరీరంతో, దాదాపు అర మీటరు పొడవున్న తోకలు కలిగి ఉండే హీరో ర్యాట్స్‌.. ఇంటి ఎలుకల కంటే కాస్త పెద్దవిగా, చిన్న పిల్లిని పోలి ఉంటాయి. భూమి లోపల ఉన్న మందుపాతరలపై అవి పేలకుండా నడిచేంత తేలికగానూ ఉంటాƇు. మొజాంబిక్, అంగోలా దేశాల సైన్యంలో కూడా ఈ ‘హీరో ర్యాట్స్‌’ దళాలు ఉన్నాయి. 

డిటెక్టర్‌ల కంటే మెరుగైనవి!
ఒక హీరో ర్యాట్‌ టెన్నిస్‌ కోర్టు విస్తీర్ణంలో ఉండే భూమి లోపలి ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో స్పష్టంగా గాలించగలదు. ఇదే పని చేయడానికి మనుషులకు కొన్ని రోజులు పడుతుంది. పైగా ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. హీరో ర్యాట్స్‌కి ఒక ఏడాది కంటే తక్కువ సమయంలో పూర్తి శిక్షణ ఇవ్వవచ్చు. ఇవి 6 నుంచి 8 సంవత్సరాలు జీవిస్తాయి. వాటి జీవితకాలంలో ఎక్కువ కాలాన్ని సైన్యంలో ఉపయోగించుకోవచ్చు. 

బెల్జియంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఎ.పి.ఒ.పి.ఒ. (యాంటీ పర్సనల్‌ లాండ్‌మైన్స్‌ డిటెక్షన్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌) ఈ ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ‘హీరో ర్యాట్స్‌‘ అని బ్రాండ్‌ చేసి, వివిధ దేశాల సైన్యాల అవసరాలకు సరఫరా చేస్తోంది. మెటల్‌ డిటెక్టర్లు గుర్తించలేని ప్లాస్టిక్‌ మందుపాతరలను కూడా గుర్తించే నైపుణ్యం వీటికి ఉంది. మానవ కఫం నమూనాలలో క్షయవ్యాధిని కూడా గుర్తించే విధంగా వీటికి శిక్షణ ఇస్తున్నారు.

సరిగ్గా బాంబు ఉన్న చోటుకు..
కంబోడియా, ఉక్రెయిన్‌లు ఈ హీరో ర్యాట్స్‌ని మందుపాతరల ఏరివేతకు ప్రయోగిస్తుండగా.. ఇజ్రాయెల్‌ భద్రతా దళాలు విమానాశ్రయాల్లో లగేజీలలోని పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఉపయోగిస్తున్నాయి. బాంబు వాసన పసిగట్టే జాగిలాలకు ఇవి దీటైనవి. కుదురుగా, వేగవంతంగా, ఎవరి గమనింపులోకీ వెళ్లకుండా ఈ ఎలుకలు ఉగ్రవాద ముప్పును ముందస్తుగా గుర్తించి, ముప్పును తప్పించటానికి సహాయపడతాయి. ఇప్పుడు రష్యా కూడా వీటిని ఉపయోగించుకుంటోంది.  

భారత్‌కు తేనెటీగల దళం
ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యం ఎలుకల సహాయం తీసుకుంటున్నట్లే.. మనదేశం సరిహద్దుల భద్రత, రక్షణల కోసం తేనెటీగల్ని పెంచుతోంది. నిరంతరం అస్థిరంగా ఉండే బంగ్లాదేశ్‌ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్‌.ఎఫ్‌.) తేనెటీగలను మోహరించింది. చొరబాట్లతోపాటు, స్మగ్లింగ్‌ను కూడా అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో, బి.ఎస్‌.ఎఫ్‌. 32వ బెటాలియన్‌ ముళ్లతీగల కంచెల వెంట పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. 

తేనెకు తేనె... భద్రతకు భద్రత! ఈ పెట్టెల లోపల ఉండే తేనెటీగల గుంపు... స్మగ్లర్లు, చొరబాటు దారులను అడ్డుకుంటుంది. కంచెలను దాటేందుకు ప్రయత్నించే వారిపైన ఆ గుంపు తక్షణం మూకుమ్మడి దాడి చేస్తుంది. తేనెటీగల కోసం ఆ సమీపంలో తేనెనిచ్చే పూల మొక్కలను పెంచుతున్నారు. బి.ఎస్‌.ఎఫ్‌. సిబ్బందికి తేనెటీగల పెంపకంలో సైన్యం శిక్షణనిస్తోంది.

నీళ్ల అడుగున.. నిగూఢాల ఛేదన
ప్రపంచ దేశాల్లోని వివిధ నావికా దళాలు సము­ద్రంలోని అత్యంత తెలివైన జీవుల్ని తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా నావికాదళం ఇందుకోసం సముద్ర క్షీరదాల కార్యక్రమం (మెరైన్‌ మమ్మల్‌ ప్రోగ్రామ్‌) చేపట్టింది. నీటి అడుగున పొంచి ఉండే మైన్ల ప్రమాదాలను గుర్తించడానికి, నావికా దళం ఆస్తులను రక్షిం­చ­డానికి డాల్ఫిన్లు, ‘కాలిఫోర్నియా సీ లయన్స్‌’కు యూఎస్‌ శిక్షణ ఇస్తోంది. 

డాల్ఫిన్లు, వాటి సహజసిద్ధమైన ధ్వని గ్రాహ్యతా నైపుణ్యంతో యంత్రాల కంటే కూడా కచ్చితంగా.. మునిగిపోయిన పేలుడు పదార్థాలను గుర్తించగలవు. అవి వేగంగా ఉంటాయి. తెలివిగా ఉంటాయి. సము­ద్ర గర్భంలోని వస్తువుల్ని, డైవర్లను గాలించేవి­ధం­గా వాటికి శిక్షణ ఉంటుంది. రష్యా కూడా నీటి అడుగున నిఘా, గూఢచర్యం వంటివాటి కోసం డాల్ఫిన్ లకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)