శ్రీవారి సన్నిధిలో అపచారం

Published on Wed, 12/24/2025 - 05:13

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఏపీ భవన్‌లో కొలువైన శ్రీవారి సన్నిధిలో మద్యం సీసాలు లభించడం కలకలం రేపింది. రాత్రివేళ మందుబాబులు బీర్లు తాగి సీసాలను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాలకు పది అడుగుల దూరంలోనే పడేశారు. విషయం మీడియా దృష్టికి రావడంతో ఆగమేఘాల మీద ఏపీ భవన్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మూడు ఖాళీ బీర్‌ బాటిళ్లు, ఒక కూల్‌డ్రింక్‌ బాటిల్, తిని పడేసిన ఆహార పదార్థాల ప్లేట్లు అక్కడి నుంచి తొలగించారు. 

దీనిపై సిబ్బందిని ఆరా తీయగా.. రాత్రి వేళలో ఇక్కడి పరిసరాల్లో నిద్రిస్తున్న క్యాంటీన్‌ సిబ్బంది తాగి పడేసి ఉంటారని ఏపీ భవన్‌ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన స్వామివారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ భవన్‌లో వేంకటేశ్వ స్వామి వారితోపాటు దుర్గా మల్లేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఆలయ నిర్వహణ టీటీడీతోపాటు ఏపీ భవన్‌ అధికారులు చూస్తారు. కానీ..  ఏపీ భవన్‌ అధికారులకు చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. బీరు సీసాలు పడేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌  తెలిపారు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)