పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి

Published on Sun, 06/23/2024 - 13:04

మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్‌లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి  ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.

2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్  ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా  భారత్‌దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.

మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్‌ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)