Breaking News

బాంబీ బకెట్‌ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?

Published on Wed, 05/01/2024 - 08:26

ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్‌ నుంచి బాంబీ బకెట్ ద్వారా  అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?

అటవీ ‍ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం  ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.

బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్‌ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.

బాంబీ బకెట్‌ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్‌గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్‌తో మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్‌లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి.

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు