Breaking News

Bal Thackeray: సీఎంనే మందు పార్టీ అడిగిన బాల్‌ ఠాక్రే

Published on Sun, 11/17/2024 - 09:20

న్యూఢిల్లీ: బాల్‌ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్‌ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్‌ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్‌ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.

మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే  ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్‌ ముంబై ఫర్‌ ఎవర్‌’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్‌ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు.  

బాల్‌ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్‌ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్‌ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

అది 1995. బాల్‌ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో  ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్‌ హెచ్‌ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్‌ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్‌ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్‌ జోషితో ‘ఏంటి మనోహర్‌.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్‌ఠాక్రే డాక్టర్‌ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్‌ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్‌ జ్యూస్‌ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.

ఇది కూడా చదవండి: ఎన్నికల ‍ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)