Breaking News

రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్‌.. భారీ ఎన్‌కౌంటర్‌!

Published on Tue, 04/22/2025 - 11:45

ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.  

కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. 

సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)