Breaking News

‘వినేశ్‌ ఫోగట్‌.. తన మొదటి కోచ్‌కే కృతజ్ఞత తెలపలేదు’

Published on Thu, 10/03/2024 - 17:14

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌పై మాజీ రెజ్లర్‌ బబితా ఫోగట్‌ విమర్శలు గుప్పించారు. వినేశ్‌ ఫోగట్‌ రెజ్లింగ్‌ కెరీర్‌ కాపాడుకోవడానికి తన తండ్రి మహవీర్‌ ఫోగట్‌ ఎంతో పోరాటం చేశారని అన్నారామె. కానీ ఈ విషయంలో ఆయనకు వినేశ్‌ ఫోగట్‌ కృతజ్ఞతలు తెలపలేదని ఆరోపించారు. బబితా ఫోగట్‌ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. అనంతరం వినేశ్‌ తన కోచ్‌లు, ఫిజియోలు, ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆమె మొదటి కోచ్ అయిన మహావీర్ ఫోగట్ కృతజ్ఞతలు తెలపలేదు. నేను ఇప్పటివరకు మా నాన్న ఏడ్చిన సందర్భాలను కేవలం మూడు చూశాను. 

మా అక్కలు వివాహం చేసుకున్న సమయంలో, మా పెద్దనాన్న మరణించిన సమయంలో, ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌ ఫోగట్‌ అనర్హత గురైన సమయంలో ఆయన ఏడ్చారు. మా పెద్దనాన్న మరణించిన సమయంలో వినేశ్‌ రెజ్లింగ్‌ మానేస్తే.. ఇంటివెళ్లి మరీ రెజ్లింగ్‌ ప్రాక్టిస్‌ చేయాలని ప్రోత్సహించారు. అంతలా మా నాన్న వినేశ్‌ కోసం కష్టపడ్డారు. కానీ ఆమె తన మొదటి గురువును వదిలేసి.. మిగతావారికి కృతజ్ఞతలు తెలిపారు’’ అని అన్నారు.

ఇక.. ఇటీవల వినేశ్‌ ఫోగట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్టోబర్‌ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)