Breaking News

అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!

Published on Tue, 04/30/2024 - 12:46

యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.

అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి  కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.

ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని  మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)