Breaking News

అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు

Published on Tue, 01/16/2024 - 09:34

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న  రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ ఏడువేల మందికి పైగా అతిథులను రామ మందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. 

రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..

మొదటి రోజు (జనవరి 16)
నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజు (జనవరి 17)
రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు.

మూడవ రోజు(జనవరి 18)
గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి.

నాల్గవ రోజు(జనవరి 19)
పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన  చేయనున్నారు.

ఐదవ రోజు(జనవరి 20)
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు.

ఆరవ రోజు(21 జనవరి 21)
రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు.

ఏడవ రోజు(జనవరి 22)
ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. 
ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఏమన్నది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)