Breaking News

నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?

Published on Sat, 01/20/2024 - 09:07

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్‌లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన  కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. 

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. 
ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి!

ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)