Breaking News

Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Published on Mon, 01/22/2024 - 05:18

అయోధ్య: బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో నగరమంతటా పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ట వేదిక వద్ద, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో మోహరించారు. ఆలయం చుట్టూ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు బిగించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆయోధ్యకు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్‌ కారిడర్‌లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్‌ లా అండ్‌ ఆర్డర్‌ స్పెషల్‌ డీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. ఫైజాబాద్‌ జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)