Breaking News

తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..

Published on Wed, 01/24/2024 - 07:53

పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్‌లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్‌లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్‌ భావించిందట.  ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్‌ త్వరలో వెల్లడించనుంది.

జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)