Breaking News

అయోధ్య రామాలయానికి ఏడాది.. నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?

Published on Wed, 01/22/2025 - 11:55

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక  ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్‌లల్లాను దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వస్తున్న రామ భక్తులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ పంచాంగాన్ని అనుసరించి జనవరి 11న తొలి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చినవారు అయోధ్యకు కూడా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయోధ్య ధామ్‌లో ట్రస్ట్‌ పలు సదుపాయాలు కల్పించింది.  

అయోధ్య ఎస్పీ  మధుసూదన్ సింగ్  విలేకరులతో మాట్లాడుతూ, అయోధ్యకు భక్తుల రాక అధికంగా ఉన్నందున పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు అయోధ్యలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారన్నారు. సెక్టార్ జోన్ వద్ద పార్కింగ్ సౌకర్యం  ఏర్పాటు చేశామన్నారు. సరయు ఘాట్‌లో స్నానం చేసిన తర్వాత, భక్తులు నాగేశ్వర్ ధామ్, హనుమాన్ హనుమాన్ గర్హి, రామ్ లల్లాను సందర్శిస్తారని  ఆయన తెలిపారు.

అందరికీ బాలరాముని దర్శనం కల్పించేందుకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశామన్నారు. రామ మందిర భవననిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండవ అంతస్తుల పనులు మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా ఆలయం లోపల ఐకానోగ్రఫీ, ఇతర క్లాడింగ్ పనులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్ రెండవ ఫ్లోర్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)