Breaking News

రామ్‌లల్లా దర్శన సమయాల్లో మార్పులు

Published on Sat, 01/27/2024 - 07:47

అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని  కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మీడియాకు అందించింది.
ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త

విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా  లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్‌లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్‌ వివరాలు..

మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు
ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు
దర్శనం: ఉదయం 7 గంటల నుంచి
భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు
సాయంత్రం హారతి: 7.30 గంటలకు
రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు
శయన హారతి: రాత్రి 10 గంటలకు

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)