Breaking News

అయోధ్యలో మసీదు నిర్మాణం ఎంతవరకూ వచ్చింది?

Published on Mon, 09/23/2024 - 13:31

అయోధ్య: యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆర్థిక కారణాలతో మసీదు పనులు నిలిచిపోయాయి. మసీదును నిర్మిస్తున్న ట్రస్ట్ ఐఐసీఎఫ్‌కు సంబంధించిన నాలుగు కమిటీలు రద్దు అయిన దరిమిలా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుస్తోంది.

2019, నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మసీదు కోసం మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అయితే మసీదు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)తన నాలుగు కమిటీలను రద్దు చేసింది.

ఐఐసీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. ఈ బోర్డు ఈ భూమిని పరిరక్షించేందుకు ఐఐసీఎఫ్‌ని ఏర్పాటు చేసింది. ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కమిటీలు మసీదు పేరుతో విరాళాలు సేకరించేందుకు పలు నకిలీ ఖాతాలు తెరిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అథర్ హుస్సేన్ తెలిపారు.

మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ మసీదు, లైబ్రరీ నిర్మించాలని ఐఐసీఎఫ్ ప్రతిపాదించింది. అయితే ట్రస్టుకు డబ్బు కొరత ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఐఐసీఎఫ్ విరాళంగా కోటి రూపాయలు అందుకుంది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రస్టుకు రూ.3 నుంచి 4 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. కాగా మసీదు నిర్మాణ పనులను చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిధులు సేకరణ జరిగాక మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుయని ఐఐసీఎఫ్ తెలిపింది. 

ఇది కూడా చదవండి: రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)