Breaking News

కస్టమ్స్ అధికారిపై మూక దాడి

Published on Mon, 10/27/2025 - 15:48

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మూక దాడి ఘటన చోటుచేసుకుంది. ఒక కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్, అతని భార్యపై వారి ఇంటిలో ఆటో డ్రైవర్ నేతృత్వంలోని 50 మంది గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఇంటికి ఆలస్యంగా వచ్చారు.

ఇంతలో దాడికి పాల్పడినవారంతా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, అతని భార్య  కారులో ఇంటికి వస్తుండగా వారి ఇంటి సమీపలో వారి కారును ఒక ఆటో ఢీకొంది. ఈ నేపధ్యంలో ఆటోడ్రైవర్‌ అజీజుల్ గాజీతో ప్రదీప్ కుమార్ ఘర్షణకు దిగారు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత ఆటోడ్రైవర్‌ అజీజుల్ గాజీ కొంతమందిని తనతోపాటు తీసుకువచ్చి, ఆ అధికారి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. తరువాత అక్కడ విధ్వంసం సృష్టించారు.

బాధితుడు ప్రదీప్ కుమార్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 50 మంది అతని ఇంటిలోనికి చొరబడి, అతనిని అతని భార్యను దారుణంగా కొట్టారు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు.  స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న తర్వాత ప్రదీప్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)