Breaking News

అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్‌! ఫొటోలు షేర్‌ చేశాడని క్రిమినల్ కేసు

Published on Sun, 04/23/2023 - 12:57

లక్నో: గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్‌ లాయర్ ఖాన్‌ సౌతల్ హనీఫ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు. 

ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్‌స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు.

ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్‌కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్‌ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు.

అయితే ఏప్రిల్‌ 13న అసద్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్‌ అహ్మద్‌ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది.
చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)