Breaking News

ముంబైలో తప్పిన విమానాల ఢీ

Published on Sun, 06/09/2024 - 15:35

ముంబై:ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. శనివారం విమానాశ్రయంలోని ఓ రన్‌వే పై ఓ వైపు ఎయిర్‌ఇండియాకు చెందిన విమానం అవుతుండగానే అదే రన్‌వేపై వెనుక ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్‌ అయింది. 

టేక్‌ఆఫ్‌ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) కమ్యూనికేషన్‌ లోపమే కారణమని వెల్లడైంది. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి పొరపాటున ల్యాండింగ్‌కు అనుమతిచ్చినట్లు తేలింది.

ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొన్ని సెకన్ల ముందు ఇదే రన్‌వేపై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా విమానం టేకాఫ్‌ అయింది.  ఎయిర్‌ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకన్లు ఆలస్యమైనా భారీగా ప్రాణ నష్టం జరిగేది. 

ఈ ఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఇండిగో విమానం ల్యాండ్‌ అయ్యేందుకు క్లియరెన్స్‌ ఇచ్చిన ఏటీసీ ఉద్యోగిని ఇప్పటికే తొలగించారు.  

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)